- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
missing : సర్టిఫికెట్స్ తీసుకువస్తానని వెళ్లిన యువతి అదృశ్యం
తన సర్టిఫికెట్స్ తీసుకువస్తానని ఇంట్లో నుంచి వెళ్లిన యువతి తిరిగి రాకపోవడంతో తండ్రి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

దిశ, చేగుంట : తన సర్టిఫికెట్స్ తీసుకువస్తానని ఇంట్లో నుంచి వెళ్లిన యువతి తిరిగి రాకపోవడంతో తండ్రి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. చేగుంట ఎస్సై బాలరాజ్ తెలిపిన వివరాల ప్రకారం మండల పరిధిలోని వడియారం గ్రామానికి చెందిన పోతుల మాశ్రీత ఈనెల 23వ తేదీన ఇంటి నుండి వెళ్లిపోయినట్లు తెలిపారు. సంగారెడ్డి జిల్లా పసల్వాడిలో ఉంటున్న తన చిన్నమ్మ రుద్రారం భావన ఇంటికి వెళ్లి
సర్టిఫికెట్స్ తీసుకొస్తానని వెళ్లినట్లు తెలిపారు. 23వ తేదీ నుండి నేటి వరకు తిరిగి రాకపోవడంతో యువతీ అదృశ్యమైనట్లు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. ఇంట్లో వెళ్లిన నాటి నుండి నేటి వరకు తిరిగి ఇంటికి రానందున ఆమె గురించి చుట్టుపక్కల, వారి బంధువుల వద్ద వెతికినా ఎలాంటి ఆచూకీ లభించలేదని , ఆమెకు ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ వస్తుంది అని పేర్కొన్నారు. ఆమె తండ్రి శ్రీనివాస్ రెడ్డి ఫిర్యాదు మేరకు చేగుంట ఎస్సై బాలరాజ్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
- Tags
- missing






