సెలవులకు అమ్మమ్మ ఇంటికి వచ్చిన బాలుడు అనంతలోకాలకు...

by Sridhar Babu |
సెలవులకు అమ్మమ్మ ఇంటికి వచ్చిన బాలుడు అనంతలోకాలకు...
X

దిశ, నాగారం : స్థానిక ఫణిగిరి ఎక్స్ రోడ్డు వద్ద సాయంత్రం జాతీయ రహదారి 365B పక్కన నిలబడి ఉన్న మహమ్మద్ అబుబకర్ (8) ను సూర్యాపేట నుండి జనగామ వైపు వెళ్తున్న లారీ ఢీకొట్టింది. లారీ డ్రైవర్ అతివేగంతో నిర్లక్ష్యంగా లారీ నడపడంతోనే ప్రమాదం జరిగింది. మృతుని తల్లిదండ్రులది హైదరాబాద్. తల్లి నసీమా, తండ్రి అస్రఫ్. తండ్రి బతుకుదెరువు కోసం దుబాయ్ కి వెళ్లాడు. తల్లి నసీమా ఆమె తల్లిగారింటి వద్ద నల్గొండలో ఉంటూ పిల్లలను చదివిస్తుంది.

అబూబకర్ నల్గొండ లిటిల్ ఫ్లవర్ స్కూల్లో చదువుతున్నాడు. వరుసగా సెలవులు వచ్చినందున అమ్మమ్మ వాళ్ల ఊరు ఫణిగిరికి వచ్చాడు. సాయంత్రం బయటికి వెళ్లి ఫణిగిరి ఎక్స్ రోడ్డు వద్ద వాళ్ల తాత మహమ్మద్ యాకుబ్ అలీ కూల్​డ్రింక్స్​, తినుబండారాలను కొనిచ్చాడు. వాటిని తింటూ ఫణిగిరివైపు రోడ్డు చివర నిలబడి ఉండగా లారీ మృత్యువు రూపంలో వచ్చింది. మృతుని తల్లి నసీమా ఫిర్యాదు మేరకు నాగారం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story