- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యం
by Sridhar Babu |
మండలంలోని పోలీస్టేషన్ పరిధిలో ఓ గర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైంది.

X
దిశ,నేలకొండపల్లి : మండలంలోని పోలీస్టేషన్ పరిధిలో ఓ గర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని రామచంద్రాపురం శివార్లలోని పాలేరు వాగులో స్థానికులకు శుక్రవారం కుళ్లిపోయిన మహిళ మృతదేహం కనబడటంతో పోలీసులకు సమాచారమిచ్చారు. వారు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేయగా మహిళ శరీరం పూర్తిగా కుళ్లిపోయి గుర్తుపట్టని విధంగా ఉంది. మృతురాలి వయసు సుమారు 20-25 మధ్య ఉంటుందని తెలిపారు. గులాబీ కలర్ ఫ్లవర్స్ గల పంజాబీ డ్రెస్ ధరించి ఉన్నట్లు గుర్తించారు. ఇటీవల వచ్చిన వరదల్లో ఈ మృతదేహం కొట్టుకొచ్చినట్లు తెలుస్తుంది. మృతదేహాన్ని మార్చురీకి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
Next Story






