- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వివాహిత అనుమానస్పద మృతి.. హత్యా, ఆత్మహత్యా..?
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఎల్లమ్మ గుట్టలో దారుణం జరిగింది.

దిశ, నిజామాబాద్ క్రైం : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఎల్లమ్మ గుట్టలో దారుణం జరిగింది. కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన వివాహిత వేముల నవిత(31) అనుమానాస్పద స్థితిలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన మంగళవారం ఆలస్యంగా వెలుగు చూసింది. నవితను గత కొన్ని రోజులుగా అదనపు కట్నం కోసం భర్త, అత్త మామ, ఆడపడుచుల వేధింపులకు గురవుతున్నారు. గత 9 సంవత్సరాల క్రితం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఎల్లమ్మ గుట్టకు చెందిన వరుణ్ గౌడ్‌తో నవితకు వివాహం చేశారు కుటుంబ సభ్యులు.
వివాహమైన కొన్ని సంవత్సరాలకు అదనపు కట్నం తేవాలని భర్త వరుణ్ గౌడ్, కుటుంబ సభ్యులు వేధింపులకు గురి చేశారు. నవిత జిల్లా కేంద్రంలోని చంద్రశేఖర్ కాలనీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ల్యాబ్ టెక్నీషియన్ గా ఔట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్నారు. అదనపు కట్నం తేవాలని వేధిస్తూ భర్త వరుణ్ గౌడ్‌తో పాటు అత్త మామ, ఆడపడుచులు ఉరివేసి హత్య చేశారని నవిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తమ కుమార్తెను హత్య చేసిన భర్త వరుణ్ గౌడ్‌తో పాటు అత్త మామ, ఆడపడుచులపై కేసు నమోదు చేయాలని నవిత కుటుంబ సభ్యుల డిమాండ్ చేస్తున్నారు. కాగా మృతురాలికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.






