Suicide: ట్రైన్‌ కింద పడి రైల్వే కానిస్టేబుల్ ఆత్మహత్య..

by I. Sairam |

రైలు కింద పడి కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది.

Suicide: ట్రైన్‌ కింద పడి రైల్వే కానిస్టేబుల్  ఆత్మహత్య..
X

దిశ, ఘట్‌కేసర్: రైలు కింద పడి కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సికింద్రాబాద్ పరిధిలోని గోపాలపురం రైల్వేస్టేషన్లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న నరసింహ రాజు ఘటకేసర్ వద్ద రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాగా అంబర్ పేటలో నివాసం ఉంటున్న మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆర్జిక ఇబ్బందులే ఆత్మహత్యకు కారణమని రైల్వే పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story