- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎస్సై చాంబర్లో ఓ యువకుడి ఆత్మహత్యాయత్నం
by Sridhar Babu |
నిజామాబాద్ జిల్లాలో ఓ యువకుడు పోలీస్ స్టేషన్లోనే ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్దాడు.

X
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లాలో ఓ యువకుడు పోలీస్ స్టేషన్లోనే ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్దాడు. ఈ ఘటన జిల్లాలో కలకలం రేపింది. ఏకంగా ఎస్ఐ ఛాంబర్ లోనే ఉరేసుకుని ఆత్మహత్యాయత్నం చేయడంతో స్టేషన్ సిబ్బంది ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. బాధితున్ని ఆసుపత్రికి చేర్చారు. వివరాలు ఇలా ఉన్నాయి. హైదారాబాద్ కు చెందిన రమేష్ అనే యువకుడు నిజామాబాద్ కు చెందిన అమ్మాయితో ప్రేమ వ్యవహారం నడుస్తోందని తెలిసింది. ఈ క్రమంలో మంగళవారం నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ కు వచ్చిన రమేష్ స్థానిక ఎస్ఐ స్టేషన్ లో లేని సమయంలో నేరుగా ఆయన ఛాంబర్ లో ఆత్మహత్యాయత్నం చేశాడు. స్టేషన్ సిబ్బంది అడ్డుకుని బాధితున్ని హాస్పిటల్ కు తీసుకెళ్లారని తెలిసింది. యువకుడి ఆత్మహత్యాయత్నానికి కారణాలు తెలియాల్సి ఉంది.
- Tags
- Suicide attempt
Next Story






