- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > old crime > Road Accident: అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. అక్కడికక్కడే నలుగురు దుర్మరణం
Road Accident: అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. అక్కడికక్కడే నలుగురు దుర్మరణం
by Kema Shiva Kumar |
రోడ్డు ప్రమాదం (Road Accident)లో నలుగురు దుర్మరణం పాలైన విషాద ఘటన అనంతపురం జిల్లా(Ananthapur District)లో శనివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: రోడ్డు ప్రమాదం (Road Accident)లో నలుగురు దుర్మరణం పాలైన విషాద ఘటన అనంతపురం జిల్లా(Ananthapur District)లో శనివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నార్పుల (Narpula)వైపు కారులో నలుగురు కలిసి వెళ్తున్నారు. ఈ క్రమంలోనే వారు బుక్కరాయసముద్రం మండల పరిధిలోని రేకులకుంట వద్దకు చేరుకోగానే ఎదురుగా అతివేగంగా వచ్చిన లారీ, కారును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతులు అనంతపురం జిల్లా (Ananthapur District) సిండికేట్ నగర్ (Syndicate Nagar) వాసులుగా గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం సమీప ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనంతరం మృతుల కుటుంబాలకు సమాచారం అందజేశారు.
Next Story






