రేపాక గ్రామ హైస్కూల్‌లో క్షుద్రపూజల కలకలం

by Bhoopathi Nagaiah |

ఇల్లంతకుంట మండలం, రేపాక గ్రామంలో క్షుద్రపూజల కలకలం లేపింది. అసలే అమావాస్య కావడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు.

రేపాక గ్రామ హైస్కూల్‌లో క్షుద్రపూజల కలకలం
X

దిశ, ఇల్లంతకుంట : ఇల్లంతకుంట మండలం, రేపాక గ్రామంలో క్షుద్రపూజల కలకలం లేపింది. అసలే అమావాస్య కావడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. మంగళవారం తెల్లవారుజామున స్థానిక ప్రభుత్వ పాఠశాల ఆవరణలో పసుపు, కుంకుమతో ముగ్గు పోసి, దానిపై కోడిని కోసి చుట్టూ నిమ్మకాయలు, కొబ్బరి కాయ పెట్టారు. ఈ దృశ్యాలను చూసి గ్రామస్తులు భయబ్రాంతులకు గురవుతున్నారు. అయితే ఇదంతా మూఢనమ్మకమని, అలాంటి ముగ్గుల వల్ల ఎలాంటి సమస్యలు రావని జనవిజ్ఞాన వేధిక సభ్యులు చెబుతున్నారు. ప్రజలు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు.

Next Story