suicide : హయత్ నగర్ లో వివాహిత ఆత్మహత్య

by Sridhar Babu |

కట్టుకున్న భర్త వేధింపులు భరించలేక ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది.

suicide : హయత్ నగర్ లో వివాహిత ఆత్మహత్య
X

దిశ, చైతన్య పురి : కట్టుకున్న భర్త వేధింపులు భరించలేక ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం యాచారం మండలం కురుమిద్దె గ్రామానికి చెందిన రమావత్ సుజాత(21) నల్లగొండ జిల్లా చింతపల్లి

మండలం గాసిరాం తండాకు చెందిన రమావత్ శివ (23) తో 2023 మే 5న వివాహం జరిగింది. హయత్ నగర్ లో ఉంటూ జీవనం కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో సుజాత తను నివాసం ఉండే ఇంట్లోనే ఫ్యాన్ కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

బంధువుల ఆందోళన

హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని మృతురాలు సుజాత బంధువులు హయత్ నగర్ లో విజయవాడ జాతీయ రహదారిపై ధర్నా చేపట్టారు. తమకు న్యాయం చేయాలని బంధువులు డిమాండ్ చేశారు.

Next Story