- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆర్థిక ఇబ్బందుల వల్లే పిల్లలతో సహా ఆత్మహత్యకు పాల్పడ్డ మంగ
ఆర్థిక ఇబ్బందులతో మంగ ఇబ్రహీంపట్నం చెరువు దగ్గరకు వచ్చి పిల్లలతో పాటు చెరువులో దూకిన సంఘటన విధితమే.

దిశ, ఇబ్రహీంపట్నం :- ఆర్థిక ఇబ్బందులతో మంగ ఇబ్రహీంపట్నం చెరువు దగ్గరకు వచ్చి పిల్లలతో పాటు చెరువులో దూకిన సంఘటన విధితమే. మంగ చిన్న కొడుకు విగ్నేష్ రాయి పట్టుకొని పైకి రావడం జరిగింది. అక్కడ ఉన్న ప్రజలు, పోలీస్ సహాయంతో బాబును రక్షించారు. మిగతా ముగ్గురు మునిగి చనిపోయారు. అయితే రాత్రి మంగ, శరత్ షరతులను బయట తీయడం జరిగింది. మంగ కూతురు లావణ్య చెరువులో కంపచెట్లల్లో ఇరుకోవడం వల్ల శుక్రవారం ఉదయం 11:30 డిఆర్ఎఫ్, ఇబ్రహీంపట్నం పోలీసుల సహకారంతో లావణ్యను బయటికి తీయడం జరిగింది. మంగ అన్నయ్య సురేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పూర్తి వివరాల్లోకి వెళితే, మంగకి ఈమె భర్తకి ఇద్దరిదీ రెండో వివాహం. మొదటగా మంగకి మునగనూరుకి చెందిన మర్ల నరసింహ అనే వ్యక్తితో వివాహం జరిగింది. వారికి ఇద్దరు పిల్లలు కలరు ఒకరి పేరు లావణ్య వయసు 16 సంవత్సరాలు రెండవ అబ్బాయి పేరు రాఘవ 10 సంవత్సరాలు. అయితే నరసింహ మంగ ను వదిలి వేరొక ఆమెను పెళ్లి చేసుకోవడంతో మంగ తన పిల్లలతో సొంత గ్రామం అయినా మునగనూరులోనే ఉండేది. అదే సమయంలో మునగనూరు గ్రామానికి చెందిన ఓర్సు కుమార్ తండ్రి శంకరయ్య వయసు 37 సంవత్సరాలు వృత్తి రాళ్లు కొట్టడం, ఈ వ్యక్తికి కూడా గతంలో రేణుక అనే ఆమెతో వివాహం జరిగింది. వారికి ముగ్గురు ఆడ సంతానం కలరు. పెద్ద కూతురు అయిన అంజలి వయసు 16 సంవత్సరాలు కుమార్ దగ్గర ఉంటుంది.
మిగతా ఇద్దరు రేణుక తో పాటే ఉంటూ రేణుక కుమార్ ను వదిలి వెళ్ళిపోయింది. అయితే 8 సంవత్సరాల క్రితం కుమార్ మంగ ప్రేమ వివాహం చేసుకొని వనస్థలిపురంలో ఇల్లు అద్దెకి తీసుకొని పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కుమారికి మంగకి మళ్లీ ఇద్దరు పిల్లలు కలరు వారి పేర్లు కుమారుడు శరత్ వయసు 7 సంవత్సరాలు మరియు విగ్నేష్ 5 సంవత్సరాలు. అయితే వీళ్ళు చాలా అన్యోన్యంగా ఉండేవాళ్ళు. ఇది ఇలా ఉండగా గత కొంతకాలంగా వాళ్ళ సంసార లో ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టి చిన్న చిన్న గొడవలు అయ్యేవి. ఆర్థిక ఇబ్బందులతో మనస్థాపo చెంది మంగ తన పిల్లలతో పాటు చనిపోవాలని నిర్ణయించుకొని నిన్న ఇబ్రహీంపట్నం చెరువు దగ్గరకు వచ్చి ఆత్మహత్య చేసుకుంది.






