- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
డబ్బుల కోసం వెళ్లిన వ్యక్తి అనుమానస్పదంగా మృతి
దిశ, మెదక్ ప్రతినిధి : అనుమానస్పద స్థితిలో వ్యక్తి మృతి చెందిన ఘటన మెదక్ మండలం కొంటుర్ గ్రామ శివారులో మంగళవారం జరిగింది. స్థానికుల కథనం మేరకు.. మక్త భూపతి పూర్‌కు చెందిన మంగళి నర్సింలు (40) సోమవారం సాయంత్రం ఇంటి నుంచి వెళ్ళాడు. చిన్న శంకరం పేట మండలం వెంకటాయపల్లిలో ఒక వ్యక్తి వద్ద వెచ్చే డబ్బులకు కోసం వెళ్ళగా రూ.40 వేలు ఇచ్చి కొంటూర్ వద్ద బైక్ పై దించేసి వెళ్లినట్లు తెలిపారు. అక్కడే ఉన్న ఇద్దరు బైక్ పై తీసుకువెళ్ళినట్లు స్థానికులు తెలుపుతున్నారు. ఏమీ జరిగిందో తెలియదు కానీ మంగళవారం ఉదయం కొంటూర్ చెరువు సమీపంలో నర్సింలు మృతదేహాన్ని చూసిన గ్రామస్తులు పోలీస్‌లకు సమాచారం ఇచ్చారు. ఘటన స్థలానికి చేరుకున్న రూరల్ పోలీస్‌లు మృతుడు నర్సింలుగా గుర్తించి క్లస్ టీమ్‌ను రప్పించారు. చుట్టూ పక్కల విచారణ చేశారు. డబ్బుల కోసమే వెళ్లినట్లు మృతుడి భార్య తెలిపారు. డబ్బులు ఉండటం వల్ల బైక్ పై తీసుకువెళ్లిన వ్యక్తులు హత్య చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతుడి భార్య ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ మురళి తెలిపారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.