- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- ఎన్ఆర్ఐ - NRI
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
- Telugu News
తాళం వేస్తే ఖతమే
దిశ, మాచారెడ్డి : తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ జరిగింది. ఇంట్లో నుంచి 4.5 తులాల బంగారు ఆభరణాలు, మరొకరి ఇంట్లో నుంచి నగదు అపహరించుకుపోయారు. మాచారెడ్డి మండలం లచ్చపేట గ్రామంలో ఈ చోరీ జరిగింది. జనగామ దేవలక్ష్మి తన ఇంటికి తాళం వేసి కూతురితో భువనగిరిలోని బంగారులింగం దేవస్థానంకు ఈనెల 5న వెళ్లి దర్శనం ముగించుకొని శనివారం మధ్యాహ్నం ఇంటికి వచ్చారు. దాంతో తలుపు తెరిచి ఉండటం గమనించారు.
బీరువా పగులగొట్టి బట్టలు చిందరవందరగా పడేశారు. బీరువాలో దాచి ఉంచిన ఇద్దరు బిడ్డలకు చెందిన నాలుగున్నర తులాల బంగారు, 20 తులాల వెండి ఆభరణాలు చోరీ అయ్యాయి. అలాగే మరో ఇంటి నుంచి నగదు అపహరించుకుపోయారు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా క్లూస్ టీం ను రప్పించి వేలి ముద్రలు సేకరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు మాచారెడ్డి ఎస్ఐ అనిల్ తెలిపారు.
- Tags
- theft