భార్య కాపురానికి రావడం లేదని మనస్తాపంతో భర్త ఆత్మహత్య

by karthikeya |
భార్య కాపురానికి రావడం లేదని మనస్తాపంతో భర్త ఆత్మహత్య
X

దిశ, శేరిలింగంపల్లి: తన భార్య కాపురానికి రావడం లేదని మనస్థాపానికి గురై ఉరి వేసుకుని ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మియాపూర్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. శ్రీశైలం సున్ని పెంటకు చెందిన రఫీ (32) ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. అదే ప్రాంతానికి చెందిన లావన్యను ప్రేమ వివాహం చేసుకున్నాడు. కొన్నాళ్లు బాగానే సాగిన వీరి కాపురంలో గొడవలు ప్రారంభమయ్యాయి. పిల్లలు కూడా లేకపోవడంతో గొడవలు తారాస్థాయికి చేరాయి. దీంతో రఫీపై అతని భార్య శ్రీశైలం పోలీసు స్టేషన్ లో 498(A) కింద కేసు పెట్టింది.

అనంతరం ఆమె హైదరాబాద్ నగరానికి వచ్చి అరబిందో ఫార్మసీలో లేబర్ పని చేసుకుంటూ మియాపూర్ బస్ బాడీ సమీపంలో ఓ ప్రైవేట్ హాస్టల్లో ఉంటుంది. భార్య కాపురానికి రాకపోవడం, తనపై పోలీసు స్టేషన్ లో కేసు పెట్టడంతో మనస్థాపానికి గురైన రఫీ తన భార్య ఉంటున్న చోటు తెలుసుకుని నగరానికి వచ్చాడు. తన భార్యకు కనబడేలా మియాపూర్ బస్సు బాడీ బిల్డింగ్ సనీపంలో చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించి మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్ కు తరలించారు. కేసు నమోదు చేసుకున్న మియాపూర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story