భార్య కాపురానికి రావడంలేదని భర్త ఆత్మహత్య

by Sridhar Babu |

భార్య కాపురానికి రాలేదని భర్త ఆత్మహత్య చేసుకున్న సంఘటన కోటపల్లి పోలీస్ స్టేషన్ లో చోటు చేసుకుంది.

భార్య కాపురానికి రావడంలేదని భర్త ఆత్మహత్య
X

దిశ, కోటపల్లి క్రైమ్ : భార్య కాపురానికి రాలేదని భర్త ఆత్మహత్య చేసుకున్న సంఘటన కోటపల్లి పోలీస్ స్టేషన్ లో చోటు చేసుకుంది. ఎస్​ఐ స్రవంతి తెలిపిన వివరాల ప్రకారం మండల పరిధిలోని మోత్కుపల్లి గ్రామానికి చెందిన బెగారి నరసింహులు (42) భార్య హేమలత గత కొంత కాలంగా కాపురానికి రాకపోవడంతో మనోవేధనకు లోనయ్యాడు. దాంతో ఇంట్లో చున్నీతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తమ్ముడు ఆనందం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని పోస్ట్ మార్టం అనంతరం కుటుంబ సభ్యులకు మృత దేహాన్ని అప్పగించనున్నట్టు ఎస్​ఐ తెలిపారు.

Next Story