- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గండిపేట్‌లో భారీ అగ్ని ప్రమాదం.. 25 కార్లు దగ్ధం
by GSrikanth |
రంగారెడ్డి జిల్లా గండిపేట్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. గురువారం మధ్యాహ్నం ఖానాపూర్‌లోని ఓ కార్ల గోడౌన్‌లో మంటలు చెలరేగాయి.

X
దిశ, వెబ్‌డెస్క్: రంగారెడ్డి జిల్లా గండిపేట్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. గురువారం మధ్యాహ్నం ఖానాపూర్‌లోని ఓ కార్ల గోడౌన్‌లో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో గోడౌన్‌లో ఉన్న 25 కార్లు పూర్తిగా దగ్ధమైనట్లు తెలుస్తోంది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగినట్లు సిబ్బంది అనుమానిస్తున్నారు. మంటలను గమనించిన అందరూ బయటకు పరుగులు తీయడంతో పెను ప్రమాదం తప్పింది. స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న పోలీసులు.. ఫైర్ అధికారులతో కలిసి గోడౌన్‌కు చేరుకున్నారు. ఫైరింజన్ల సాయంతో మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. అనంతరం కేసు నమోదు చేసుకొని ప్రమాదానికి సంబంధించిన వివరాలపై ఆరా తీస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.
Next Story






