- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అంత్యక్రియలకు వెళ్లి తిరిగి వస్తుండగా అనంతలోకాలకు
by Sridhar Babu |
అంత్యక్రియలకు వెళ్లి తిరిగి స్వగ్రామానికి వస్తుండగా బైకు అదుపుతప్పి వ్యక్తి మృతి చెందిన సంఘటన నాంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం సాయంత్రం జరిగింది.

X
దిశ ,మర్రిగూడ( నాంపల్లి) : అంత్యక్రియలకు వెళ్లి తిరిగి స్వగ్రామానికి వస్తుండగా బైకు అదుపుతప్పి వ్యక్తి మృతి చెందిన సంఘటన నాంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం సాయంత్రం జరిగింది. ఎస్ఐ శోభన్ బాబు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. చండూరు మండలం పుల్లెంల గ్రామానికి చెందిన పోలే రామశంకర్ మంగళవారం తన కుటుంబ సభ్యులతో కలిసి నేరళ్లపల్లి గ్రామంలో తన బంధువు ఆఖరి వామస్వామి అంత్యక్రియలకు వెళ్లి తిరిగి పుల్లెంల గ్రామానికి వస్తుండగా బైకు అదుపుతప్పి కిందపడ్డాడు. దాంతో తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుని తండ్రి శ్రీను ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
- Tags
- Accident
Next Story






