Ganjai gang : గంజాయి ముఠా గుట్టు రట్టు

by Sridhar Babu |

గంజాయి ముఠా గుట్టు రట్టు అయింది.

Ganjai gang : గంజాయి ముఠా గుట్టు రట్టు
X

దిశ, మెట్ పల్లి : గంజాయి ముఠా గుట్టు రట్టు అయింది. గంజాయి రహిత జిల్లాగా మార్చడమే ఉద్దేశంగా పని చేయాలనే జిల్లా ఎస్పీ ఆదేశాలతో పోలీస్ యంత్రాంగం దూకుడు ప్రదర్శిస్తున్నారు. అక్రమ కార్యకలాపాలకు చేపడుతున్న గంజాయి ముఠా పై ఉక్కుపాదం మోపుతున్నారు. వివరాల్లోకి వెళితే జగిత్యాల జిల్లా మెట్ పల్లిలో వెంకట్రావు పేట్ ఓ ప్రభుత్వ పాఠశాల వద్ద

మంగళవారం ఇద్దరు అనుమానిత వ్యక్తులు గంజాయి తో పట్టుపడినట్లు సమాచారం. అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు తెలిసింది. అయితే ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు, ఏంటి, ఆ ప్రభుత్వ పాఠశాల వద్ద గంజాయి నిందుతులకు ఉన్న సంబంధాలు ఏంటి అనే కోణంలో విచారిస్తున్నట్లు తెలిసింది. నిందితులు ఎక్కడి వారు ఎంత గంజాయి పట్టుకున్నారనే విషయం తెలియాల్సి ఉంది.

Next Story