- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
- Telugu News
గర్భిణీపై గ్యాంగ్ రేప్: మధ్యప్రదేశ్‌లో దారుణ ఘటన
దిశ, నేషనల్ బ్యూరో: మధ్యప్రదేశ్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. 34ఏళ్ల ఓ గర్భిణీ స్త్రీ పై ముగ్గురు వ్యక్తులు సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. అంతేగాక ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఈ ఘటన అంబాహ్ పట్టణానికి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న చాంద్‌కాపురా గ్రామంలో శుక్రవారం జరిగినట్టు పోలీసులు తెలిపారు. వివరాల్లోకి వెళ్లే..మొరెనా జిల్లాలోని అంబాహ్ ప్రాంతంలో ఓ విషయంలో రాజీ కుదిర్చేందుకు బాధిత మహిళ మరో మహిళ ఇంటికి వెళ్లింది. ఈ క్రమంలోనే మాట్లాడుతుండగా ఆ ఇంట్లో ఉన్న ముగ్గురు నిందితులు 34ఏళ్ల గర్బిణీపై లైంగిక దాడికి పాల్పడ్డారు. అనంతరం ఈ ముగ్గురూ, ఆ ఇంట్లో ఉన్న మహిళ గర్భిణీ స్త్రీపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. వెంటనే స్పందించిన స్థానికులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. మహిళ 80 శాతం కాలిపోయిందని, పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు వెల్లడించారు. నిందితులు పరారీలో ఉన్నారని త్వరలోనే అరెస్టు చేస్తామని పేర్కొన్నారు.