జగిత్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం...ఇద్దరు మృతి

by Sridhar Babu |
జగిత్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం...ఇద్దరు మృతి
X

దిశ, జగిత్యాల రూరల్ : జగిత్యాల జిల్లా పొలాస స్టేజీ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డాడు. రాయికల్ మండలం అల్లిపూర్ గ్రామానికి చెందిన బైండ్ల లచ్చన్న(52), ఆమె మనువరాలు శ్రీనిధి(13), మనవడు మల్లిఖార్జున్‌ (10) ధర్మపురి నుండి జగిత్యాల వైపు బైక్​పై వస్తున్నారు. ఈ క్రమంలో పొలాస స్టేజీ వద్ద ఆర్టీసీ బస్సును ప్రైవేట్ ట్రావెల్స్ కు చెందిన బస్సు ఓవర్​ టేక్ చేసే క్రమంలో ఎదురుగా వస్తున్న లచ్చన్న వాహనంతో పాటు ముందున్న మరో బైక్ ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బైండ్ల లచ్చన్న, శ్రీనిధి సంఘటనా స్థలంలోనే మృతి చెందగా మల్లిఖార్జున్ తీవ్రంగా గాయపడ్డాడు.

మరో వాహనంపై ఉన్న పొలాస గ్రామానికి చెందిన నర్సయ్య, రాజన్నలకి గాయాలయ్యాయి. గాయపడిన వారిని హుటాహుటిన చికిత్స నిమిత్తం జగిత్యాల ఆస్పత్రికి తరలించారు. కాగా మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా నుజ్జునుజ్జు అయ్యాయి. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు మృతి చెందగా బాలుడి పరిస్థితి అత్యంత విషమంగా ఉండడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.

Advertisement

Next Story

Most Viewed