- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Road Accident:ఘోర ప్రమాదం..ఆర్టీసీ బస్సును ఢీకొన్న కారు..ఐదుగురు మృతి
by Jakkula.Mamatha |
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రామనాథపురం సమీపంలో ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

X
దిశ,వెబ్‌డెస్క్:తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రామనాథపురం సమీపంలో ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ప్యాసింజర్‌కు వాంతులు కావడంతో ఆర్టీసీ బస్సును డ్రైవర్ రోడ్డు పక్కన ఆపగా..అదే సమయంలో వెనక నుంచి వేగంగా వస్తున్న కారు అదుపుతప్పి బస్సును ఢీ కొట్టినట్లు సమాచారం. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న రాజేష్, సెంథిల్, ప్రణవిక, దర్శిలరాణి, ఈశ్వరి సంఘటన స్థలంలోనే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన మరో ఇద్దరిని రామనాథపురం ఆసుపత్రికి తరలించారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉండటం విచారకరం. విషయం తెలుసుకొని సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
Next Story






