- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
crime news : కుటుంబ కలహాలతో వాగులో దూకి వ్యక్తి ఆత్మహత్య..
by Batti.Sumithra |
కుటుంబ కలహాలతో పెద్దవాగులో దూకి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నట్లు దహేగాం ఎస్సై రాజు తెలిపారు.

X
దిశ, బెజ్జూర్ : కుటుంబ కలహాలతో పెద్దవాగులో దూకి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నట్లు దహేగాం ఎస్సై రాజు తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం దహేగాం మండలం ఇట్యాల గ్రామానికి చెందిన కోట్రంగి సంతోష్ (35) అనే వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు. శనివారం రాత్రి 9:30 గంటలకు సంతోష్ ఇంట్లో గొడవ జరిగింది. దీంతో కుటుంబ కలహాలతో అతను ఇంటి నుండి వెళ్లినట్లు తెలిపారు. సంతోష్ కోసం గాలిస్తుండగా, ఆదివారం పెద్దవాగులో శవమై లభించినట్లు మృతుని భార్య భూదేవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజు తెలిపారు.
Next Story






