గోదావరిలో దూకి కానిస్టేబుల్ ఆత్మహత్య

by Sridhar Babu |

కొత్తగూడెం పట్టణానికి చెందిన క్లూస్ టీమ్ కానిస్టేబుల్ రమణారెడ్డి భద్రాచలం వంతెన పైనుండి గోదావరిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న సీఐ సంజీవరావు, ఎస్ఐ విజయలక్ష్మి సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు.

గోదావరిలో దూకి కానిస్టేబుల్ ఆత్మహత్య
X

దిశ,భద్రాచలం : కొత్తగూడెం పట్టణానికి చెందిన క్లూస్ టీమ్ కానిస్టేబుల్ రమణారెడ్డి భద్రాచలం వంతెన పైనుండి గోదావరిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న సీఐ సంజీవరావు, ఎస్ఐ విజయలక్ష్మి సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ట్రాఫిక్ ఎస్ఐ మధు ప్రసాద్ ఆధ్వర్యంలో గజ ఈతగాళ్లతో గోదావరిలో రమణారెడ్డి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుందటంతో గజ ఈతగాళ్లకు కష్టంగా మారింది. ఇది ఇలా ఉండగా కానిస్టేబుల్ రమణారెడ్డి ఆత్మ హత్య చేసుకోవాడానికి ముందు ఒక సెల్ఫీ వీడియో చిత్రీకరించారు. దానిలో ఆయన మాట్లాడుతూ కారు యాక్సిడెంట్ వలన 15 రోజులుగా నిద్ర రావడం లేదని, తన తండ్రి కష్టపడి నిర్మించుకున్న ఇల్లు వరదలకు మునిగిపోయిందని, తాను జీవితాన్ని ఇంతకన్నా ముందుకు తీసుకుని వెళ్లలేక ఆత్మహత్య చేసుకుంటున్నానని పేర్కొన్నారు.

Next Story