- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వైద్య పరీక్షలు చేయించుకోవటం కోసం వస్తూ అనంతలోకాలకు
ట్రాక్టర్ (డోజర్ )ఢీ కొని ద్విచక్ర వాహనదారుడు మృతి చెందిన సంఘటన మంగళవారం చండూరు మున్సిపల్ కేంద్రంలో చోటుచేసుకుంది.

దిశ, చండూరు : ట్రాక్టర్ (డోజర్ )ఢీ కొని ద్విచక్ర వాహనదారుడు మృతి చెందిన సంఘటన మంగళవారం చండూరు మున్సిపల్ కేంద్రంలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మండల పరిధిలోని తాస్కాని గూడెం గ్రామానికి చెందిన వరకాల సత్తయ్య తన భార్య యాదమ్మ తో కలిసి వైద్య పరీక్షలు చేయించుకోవటం కోసం చండూరుకు వస్తున్నారు. చండూరు శ్మశాన వాటిక సమీపంలోకి రాగానే డంపింగ్ యార్డ్ దగ్గర రోడ్డు పక్కన చెత్తను డోజర్ (ట్రాక్టర్ )తో నెట్టుతున్న డ్రైవర్ రివర్స్ లో వచ్చి ద్విచక్ర వాహనం పై వస్తున్న సత్తయ్యను బలంగా ఢీకొట్టాడు.
స్థానికులు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించగా మెరుగైన వైద్య సేవల కోసం 108 వాహనంలో నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. మృతుని భార్య కు తీవ్ర గాయాలు కావటంతో ఆమె నల్లగొండ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. మృతునికి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. మృతుని చిన్న కూతురు పద్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ఎన్. వెంకన్న తెలిపారు.
- Tags
- person died






