తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ..దైవదర్శనానికి వెళ్లి వచ్చేలోపే

by Chintha Aamani |

వనపర్తి జిల్లా రేవల్లి మండల పరిధిలోని కొంకలపల్లి గ్రామంలో చోరీ జరిగిన

తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ..దైవదర్శనానికి వెళ్లి వచ్చేలోపే
X

దిశ, రేవల్లి: వనపర్తి జిల్లా రేవల్లి మండల పరిధిలోని కొంకలపల్లి గ్రామంలో చోరీ జరిగిన ఘటన బుధవారం వెలుగు చూసింది. స్థానిక ఎస్సై రాము వివరాల ప్రకారం కొంకలపల్లి గ్రామానికి చెందిన వెంకటేష్ (27) తన కుటుంబ సభ్యులతో కలిసి నల్గొండ జిల్లా చారకొండ లోని దైవ దర్శనానికి వెళ్లారు. మరుసటి రోజు ఉదయం ఆరు గంటల సమయంలో ఇంటి తలుపులు తెరుచుకొని ఉండడంతో చుట్టుపక్కల వారు గమనించి వెంకటేష్ కు విషయాన్ని తెలియజేశారు. వెంటనే వెంకటేష్ తన కుటుంబ సభ్యులతో గ్రామానికి చేరుకొని వచ్చి చూడగా బీరువా తాళం తీసి ఉండడం అదేవిధంగా రూ.30 వేల నగదు అపహరణకు గురైనట్లు భావించి పోలీసులకు సమాచారం ఇచ్చారు అని ఎస్ఐ రాము తెలిపారు. అదేవిధంగా ఘటన స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించి కేసు దర్యాప్తు చేయడమైనది ఆయన తెలిపారు.

Next Story