BREAKING: వికారాబాద్ జిల్లాలో ఘోరం.. ఏకంగా 50 మేకలను ఢీకొట్టిన రెండు రైళ్లు

by Shiva |
BREAKING: వికారాబాద్ జిల్లాలో ఘోరం.. ఏకంగా 50 మేకలను ఢీకొట్టిన రెండు రైళ్లు
X

దిశ, వెబ్‌డెస్క్: వికారాబాద్ జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ధరూర్ మండలం డీకే తండాకు చెందిన గొర్రెల కాపరులు మేకలను మేతకు తీసుకెళ్లారు. అయితే, మార్గమధ్యలో వాటికి అడవి పందుల గుంపు ఎదురైంది. ఈ క్రమంలో బెదిరిన మేకలు పక్కనే ఉన్న రైల్వే ట్రాక్‌పైకి వెళ్లాయి. అదే సమయంలో ట్రాక్‌పైకి రెండు రైళ్లు ఒకదాని తరువాత మరొకటి దూసుకురావడంతో 50 మేకలు స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయి చెల్లాచెదురుగా పడిపోయాయి. దీంతో గొర్రెల కాపరులు తాము జీవనోపాధి కోల్పోయామంటూ కన్నీరుమున్నీరయ్యారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలంటూ వేడుకుంటున్నారు.

Advertisement

Next Story