- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > old crime > BREAKING: ఉత్తరప్రదేశ్‌లో తీవ్ర విషాదం.. షాట్ సర్య్కూట్‌తో నలుగురు చిన్నారులు సజీవ దహనం
BREAKING: ఉత్తరప్రదేశ్‌లో తీవ్ర విషాదం.. షాట్ సర్య్కూట్‌తో నలుగురు చిన్నారులు సజీవ దహనం
by Kema Shiva Kumar |
షాట్ సర్య్కూట్ కారణంగా నలుగురు చిన్నారులు సజీవ దహనమైన హృదయ విదారక ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్ జిల్లా పల్లవ్‌పురంలో చోటుచేసుకుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: షాట్ సర్య్కూట్ కారణంగా నలుగురు చిన్నారులు సజీవ దహనమైన హృదయ విదారక ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్ జిల్లా పల్లవ్‌పురంలో చోటుచేసుకుంది. పోలీస్ స్టేషన్ పరిధిలోని మోడిపురం జనతా కాలనీలోని ఓ ఇంట్లో భార్యభర్తలు, నలుగురు పిల్లలతో కలిసి నివాసం ఉంటున్నారు. అయితే, అందులో ఒక బాలుడు సెల్‌ఫోన్ ఛార్జింగ్ పెడుతుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న సీఐ షిచితా సింగ్ ఫైర్ సిబ్బందికి సమాచారం అందజేయగా వారు వచ్చి మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో తల్లిదండ్రులు స్వల్ప గాయాలతో బయటపడగా.. నలుగురు చిన్నారుల శరీరాలు 70 శాతం కాలిపోయాయి. ఈ మేరకు చికిత్స నిమిత్తం వారిని స్థానికంగా ఉన్న మెడికల్ కళాశాలకు చేరవేశారు. అనంతరం ఇవాళ వారు చికిత్స పొందతూ తుది శ్వాస విడిచారు.
Next Story






