- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
BREAKING: మహబూబాబాద్ జిల్లాలో తీవ్ర విషాదం.. ఉరేసుకుని దంపతుల బలవన్మరణం
by Kema Shiva Kumar |
దంపతులు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడిన హృదయ విదారక ఘటన మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం అంకన్నగూడెంలో ఇవాళ చోటుచేసుకుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: దంపతులు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడిన హృదయ విదారక ఘటన మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం అంకన్నగూడెంలో ఇవాళ చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన అనిల్, దేవి దంపతులు అంకన్నగూడెం అటవీ ప్రాంతంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. అయితే, గత నెల రోజుల క్రితం తమ ఇద్దరు కుమార్తెలకు దంపతులు ఇద్దరు కలిసి పురగుల మందు ఇచ్చి హత్య చేశారు. అనంతరం వారు గ్రామం నుంచి పరారయ్యారు. తాజాగా, అనిల్, దేవి నిర్మానుష్య ప్రాంతంలో ఉరేసుకుని ఆత్యహత్యకు పాల్పడటం పలు అనుమానాలకు తావిస్తోంది. గ్రామస్తుల సమాచారం మేరకు అంకన్నగూడెం అటవీ ప్రాంతానికి చేరుకున్న పోలీసులు ఘటనా స్థలానికి పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తును చేస్తున్నారు. దంపతుల ఆత్మహత్యకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Next Story






