BREAKING: కర్నూలు జిల్లాలో మరో సంచలనం.. వైసీపీ నేత దారుణ హత్య

by Shiva |
BREAKING: కర్నూలు జిల్లాలో మరో సంచలనం.. వైసీపీ నేత దారుణ హత్య
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ రాజకీయ హత్యల పరంపర కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలోని కర్నూలు జిల్లాలో సంచలనం చోటుచేసుకుంది. మహానంది మండల పరిధిలోని సీతారామపురంలో వైసీపీ నేత సుబ్బారాయుడిని దాండగులు రాళ్లతో అత్యంత కిరాతకంగా కొట్టి చంపేశారు. ఈ క్రమంలో గ్రామానికి చెందిన కొంతమంది టీడీపీ నాయకులు తన భర్తలు హతమార్చారంటూ మృతుడి భార్య ఆరోపించారు. అయితే, మృతుడు సుబ్బారాయుడు మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణికి అత్యంత సన్నిహత అనుచరుడిగా తెలుస్తోంది. ఈ పరిణామంతో అప్రమత్తమైన పోలీసులు గ్రామంలో ఎలాంటి అల్లర్లు జరగకుండా పికెట్ ఏర్పాటు చేశారు. అనంతరం మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం నంద్యాల ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story