శూన్య పహాడ్‌లో గుర్తు తెలియన మృతదేహం కలకలం

by Bhoopathi Nagaiah |

సూర్యాపేట జిల్లాలోని పాలకవీడు మండలం శూన్య పహాడ్‌లో గుర్తు తెలియన మృతదేహం కలకలం సృష్టించింది.

శూన్య పహాడ్‌లో గుర్తు తెలియన మృతదేహం కలకలం
X

దిశ, నేరేడుచర్ల (పాలకవీడు): సూర్యాపేట జిల్లాలోని పాలకవీడు మండలం శూన్య పహాడ్‌లో గుర్తు తెలియన మృతదేహం కలకలం సృష్టించింది. మూసీ నదిలో ఈ డెడ్ బాడీ తేలియడుతుండటంతో స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. శూన్య పహాడ్ గ్రామ శివారులోని ముసీ నదిపై ఏర్పాటుచేసిన చెక్ డాం పైన భాగంలో గుర్తు తెలియని మృతదేహం లభ్యమయింది. మృతుడు సిమెంట్ కలర్ బ్లాక్ హాఫ్ టీ షర్ట్, బ్లాక్ పాయింట్ ధరించి ఉన్నాడు. మృతదేహం ఉబ్బి కుళ్లిపోయే దశలో ఉండడంతో ఆ వ్యక్తి చనిపోయి మూడు, నాలుగు రోజులు కావచ్చని భావిస్తున్నారు.

ప్రస్తుతం మూసీ నదిలో వాటర్ ప్లోటింగ్ లేవకపోవడంతో ఇది పైనుంచి కొట్టకొచ్చిన మృతదేహం కాకపోవచ్చునని, మూసీకి ఇరువైపుల ఉన్న సూర్యాపేట, నేరేడుచర్ల, పాలకవీడు, మిర్యాలగూడ, దామరచర్ల మండలాలకు చెందిన వ్యక్తి కావచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు. మంగళవారం ఉదయం మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో వారు అక్కడ చేరుకొని పరిశీలించారు. బాడీని బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నారు. మృతదేహానికి సంబంధించిన ఏమైనా వివరాలు ఉంటే పాలకవీడు పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని కోరారు.

Next Story