బీఆర్ఎస్ పార్టీ గద్దెపై కూర్చున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి.. కారణం ఇదే..!

by Bhoopathi Nagaiah |

వరికోత మిషన్ డ్రైవర్ అజాగ్రత్తతో ఓ నిండు ప్రాణం పోయింది.

బీఆర్ఎస్ పార్టీ గద్దెపై కూర్చున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి.. కారణం ఇదే..!
X

దిశ, లింగంపేట్ : వరికోత మిషన్ డ్రైవర్ అజాగ్రత్తతో ఓ నిండు ప్రాణం పోయింది. బీఆర్ఎస్ పార్టీ గద్దెపై కూర్చున్న వ్యక్తికి వరికోత మిషన్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషాద ఘటన లింగంపేట్ మండలంలోని పోల్కంపేట గ్రామంలో బుధవారం ఉదయం జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. పోల్కంపేటకు చెందిన షాబుద్దీన్ (70) ఉదయం బస్టాండ్ ప్రాంతంలోని బీఆర్ఎస్ పార్టీ గద్దెపై కూర్చున్నాడు. అయితే అక్కడే ఉన్న వరి కోత మిషన్‌ను రివర్స్ చేస్తున్న డ్రైవర్ వెనక గద్దెపై షాబుద్దీన్‌ కూర్చున్న విషయాన్ని గ్రహించకుండా డ్రైవ్ చేయడంతో అది ఢీకొట్టింది. దీంతో తీవ్రగాయాల పాలైన షాబుద్దీన్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. షాబుద్దీన్‌ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు వరికోత మిషన్ డ్రైవర్‌పై కేసు నమోదు చేశారు.

Next Story