- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
rape case : అత్యాచారం కేసులో నిందితుడికి 20 సంవత్సరాల జైలు
మైనర్ బాలికపై అత్యాచారం కేసులో నిందితుడికి 20 సంవత్సరాల జైలు శిక్షతోపాటు 5 వేల జరిమానా విధిస్తూ జగిత్యాల కోర్టు తీర్పునిచ్చింది.

దిశ, జగిత్యాల టౌన్ : మైనర్ బాలికపై అత్యాచారం కేసులో నిందితుడికి 20 సంవత్సరాల జైలు శిక్షతోపాటు 5 వేల జరిమానా విధిస్తూ జగిత్యాల కోర్టు తీర్పునిచ్చింది. నాలుగేళ్ల క్రితం జగిత్యాల రూరల్ పీఎస్ పరిధిలో 4 ఏళ్ళ మైనర్ బాలికపై కండ్లె రమేష్ బాబు అనే వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధిత బాలిక తల్లి ఫిర్యాదు మేరకు అప్పటి ఎస్సై సతీష్ పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేయగా అప్పటి సీఐ లు కృష్ణ కుమార్, రాజేష్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు గా వ్యవహరించారు. ఈ మేరకు జూలై 24న సాక్ష్యాధారాలను పరిశీలించిన న్యాయమూర్తి నీలిమ నేరం
రుజువు కావడంతో నిందితుడికి జైలు శిక్ష విధించారు. అంతేకాకుండా బాధిత బాలికకు మూడు లక్షల నష్టపరిహారం చెల్లించాలని తీర్పునిచ్చారు. కోర్టుకు రాకుండా తప్పించుకుని తిరుగుతున్న నిందితుడిపై న్యాయస్థానం వారెంట్ జారీ చేయగా పోలీసులు పట్టుకొని మంగళవారం జైలుకు తరలించారు. నిందితుడికి శిక్ష పడటంలో కీలకంగా వ్యవహరించిన పోలీసు అధికారులను ఎస్పీ అశోక్ కుమార్ ప్రత్యేకంగా అభినందించారు.
- Tags
- rape case






