మర్రిగూడ తహసీల్దార్ మహేందర్ రెడ్డిపై ఏసీబీ దాడుల కలకలం

by Bhoopathi Nagaiah |

ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే ఆరోపణలతో మర్రిగూడ తహసీల్దార్ మహేందర్ రెడ్డిపై శనివారం ఏసీబీ దాడులు జరగడం రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టిస్తుంది.

మర్రిగూడ తహసీల్దార్ మహేందర్ రెడ్డిపై ఏసీబీ దాడుల కలకలం
X

దిశ, మర్రిగూడ: ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే ఆరోపణలతో మర్రిగూడ తహసీల్దార్ మహేందర్ రెడ్డిపై శనివారం ఏసీబీ దాడులు జరగడం రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టిస్తుంది. తహసీల్దార్ కార్యాలయంలో ఉదయం నుండి ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. గతంలో రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలంలో తహసీల్దార్‌గా విధులు నిర్వహించిన మహేందర్ రెడ్డి, అనేక అవినీతి ఆరోపణలు ఎదురుకున్న సందర్భాలు ఉన్నాయి. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయనే, కచ్చితమైన సమాచారంతో ఏసీబీ బృందాలు రంగంలోకి దిగాయి.

ప్రస్తుతం మహేందర్ రెడ్డి నెల క్రితమే బదిలీపై నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలానికి తహసీల్దార్ బాధ్యతలు తీసుకున్నారు. ఓ బృందం మర్రిగూడ తహసీల్దార్ కార్యాలయంలో సోదాలు చేపట్టారు. తహసీల్దార్ కార్యాలయ సిబ్బందిని గంటల తరబడి అధికారులు విచారిస్తున్నారు. బినామీ పేర్ల మీద, బంధువుల పేర్ల ఉన్న ఆస్తుల వివరాలను సేకరిస్తున్నట్లు సమాచారం. ఉదయం నుండి ఈ సోదాలు జరుగుతున్న నేపథ్యంలో, సాయంత్రం వరకు పూర్తి వివరాలను అధికారులు వెల్లడించనున్నట్లు తెలుస్తుంది. ఏదేమైనా అవినీతిలో మహేందర్ రెడ్డి దిట్ట అని పెద్దఎత్తున ఆరోపణలు వస్తున్నాయి.

Next Story