అమ్మాయి అనుకోని హిజ్రాను పెళ్లాడిన యువకుడు.. నాలుగేళ్లుగా న్యూడ్ వీడియోలతో అదే పని.. తట్టుకోలేని భర్త..?

by Bhoopathi Nagaiah |

ఇటీవల పెళ్లి పేరుతో జరుగుతున్న మోసాలు అన్నీ ఇన్నీ కావు. గతంలో అబ్బాయిలే మోసం చేసినా నేటి జనరేషన్‌లో అమ్మాయిలు వాళ్లను మించిపోయారు.

అమ్మాయి అనుకోని హిజ్రాను పెళ్లాడిన యువకుడు.. నాలుగేళ్లుగా న్యూడ్ వీడియోలతో అదే పని.. తట్టుకోలేని భర్త..?
X

దిశ, వెబ్‌డెస్క్ : ఇటీవల పెళ్లి పేరుతో జరుగుతున్న మోసాలు అన్నీ ఇన్నీ కావు. గతంలో అబ్బాయిలే మోసం చేసినా నేటి జనరేషన్‌లో అమ్మాయిలు వాళ్లను మించిపోయారు. నేను శ్రీమంతురాలి.. ఇదే మొదటి మ్యారేజ్.. విదేశాల్లో జాబ్ అని.. రకరకాల పేర్లతో పెళ్లి చేసుకోని అత్తారింట్లో కాలు మోపి అందినకాడికి దోచుకుపోతున్నారు. తాజాగా ఇలాంటి మోసమే జరిగినా.. ఇంతకు మించి ట్విస్ట్‌లు, చిత్రహింసలు ఉండటం గమనార్హం. ఉత్తర ప్రదేశ్‌లో వెలుగులోకి వచ్చిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

బిజ్నౌర్ జిల్లాకు చెందిన యువకుడికి 2019లో మొరాదాబాద్‌లోని ఠాకూర్ ద్వారా కొత్వాలికి చెందిన యువతితో అరంగరంగ వైభవంగా వివాహం జరిగింది. పెళ్లి చూపుల్లో అమ్మాయి అందాన్ని చూసి ముగ్ధుడైన యువకుడు వెంటనే వివాహానికి ఓకే చెప్పేశాడు. పెళ్లి తర్వాత శోభనం రాత్రి వధువు తలపై నుంచి కొంగు తొలగించిన వరుడికి 1000 వోల్టేజీల కరెంట్ షాక్ తగిలినంత పనైంది. తను పెళ్లి చేసుకుంది అమ్మాయిని కాదని.. హిజ్రాని అని తెలిసి లబోదిబోమన్నాడు. కానీ నవ వధువు హిజ్రా మాత్రం భర్తకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. తాను ఆపరేషన్ చేయించుకున్నానని, అవయవాలు అభివృద్ధి చెందుతున్నాయని తెలిపింది. అప్పటి వరకు బయటకు చెబితే చంపేస్తానని బెదిరించింది. తన స్నేహితులు, బంధువుల వద్ద పరువు కాపాడుకోవడానికి యువకుడు కూడా సైలెంట్ అయిపోయాడు.

భర్త అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకున్న హిజ్రా భార్య అతడిని చిత్రహింసలకు గురి చేసింది. బెడ్ రూంలో సీక్రెట్ కెమెరాలు పెట్టి తమ శృంగార వీడియోలను చిత్రీకరించింది. వీటి ఆధారంగా ఎంట్రి ఇచ్చిన హిజ్రా తల్లిదండ్రులు తమకు రూ.20 లక్షలు ఇవ్వాలని, లేకపోతే వీడియోలు బయటపెడతామని, మీ కుటుంబంపై మొత్తం కేసులు పెట్టి బజారుకు ఈడుస్తామని బెదిరించాడు. అంత డబ్బు లేదని యువకుడు వేడుకున్నా వినకుండా ముగ్గురు కలిసి పలుమార్లు తీవ్రంగా కొట్టారు. ఇక వాళ్ల టార్చర్ భరించలేక రెండు రోజుల క్రితం కొత్వాలి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నాలుగేళ్లుగా తను అనుభవిస్తున్న చిత్రహింసలను వివరించాడు. బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి హిజ్రా భార్య సహ ఆమె తల్లిదండ్రులను అరెస్ట్ చేశారు.

Next Story