- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
Accident : బస్సు, ద్విచక్రవాహనం ఢీ యువకుడికి గాయాలు..
దిశ, తల్లాడ : ద్విచక్ర వాహనాన్ని బస్సు ఢీ కొట్టి యువకుడికి గాయాలైన సంఘటన తల్లాడ మండలంలో ఆదివారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఖమ్మం డిపోకి చెందిన బస్సు సత్తుపల్లి నుంచి ఖమ్మం వైపు వెళ్తూ బస్సు బస్టాండ్ లోపలికి వెళ్లి ప్రయాణికులు ఎక్కించుకొని వస్తుంది. ఈ సమయంలో నల్లగుంట్ల రామకృష్ణ అనే వ్యక్తి ద్విచక్ర వాహనం పై తల్లాడ నుంచి తెలగారం గ్రామానికి వెళ్తున్నక్రమంలో బస్సు బస్టాండ్ నుంచి బయటకు వస్తుండగా ద్విచక్ర వాహనం, బస్సు ఒక్కసారిగా ఎదురెదురు వచ్చి ఢీ కొట్టుకున్నాయి.
దీంతో యువకుడికి గాయాలు కావడంతో స్థానికులు 108 అంబులెన్స్ కి సమాచారం అందించి బాధితున్ని ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీనికి కారణం బస్టాండ్ నుంచి బస్సులు లోపలికి వెళ్లే మార్గం కానీ బయటకు వెళ్లే మార్గం గుండా కానీ ఎలాంటి సూచిక బోర్డు లేకపోవడం బస్టాండ్ ప్రాంగణం అని నేమ్ బోర్డ్స్ లేకపోవడం ద్వారా తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, ఇకనైనా అధికారులు మేల్కొని సూచిక బోర్డులు ఏర్పాటు చేయవలసిందిగా స్థానికులు కోరుతున్నారు.