అర్ధరాత్రి యువకుడి ప్రాణాలు తీసిన రౌడీ షీటర్.. కారణం ఇదే..

by Bhoopathi Nagaiah |

ఓవైపు పాతకక్షలు మరోవైపు మద్యం మత్తు.. వెరసీ ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు.

అర్ధరాత్రి యువకుడి ప్రాణాలు తీసిన రౌడీ షీటర్.. కారణం ఇదే..
X

దిశ, ఖైరతాబాద్ : ఓవైపు పాతకక్షలు మరోవైపు మద్యం మత్తు.. వెరసీ ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. సోమవారం అర్ధరాత్రి బండరాయితో మోది మరి యువకుడి ప్రాణాలు తీశాడో రౌడీ షీటర్. ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. రౌడీషీటర్ షరీఫ్‌కు తరుణ్ నాయక్ అనే యువకుడి మధ్య పాతకక్షలు ఉన్నాయి. దీనిని దృష్టిలో పెట్టుకున్న షరీఫ్ సోమవారం అర్ధరాత్రి ఫుల్‌గా మద్యం సేవించి ఎస్ఆర్ నగర్‌లో ఉన్న తరుణ్‌పై బండరాయితో దాడి చేశాడు. ఈ దాడితో తరుణ్ తీవ్రగాయాలపాలయ్యాడు. సమాచారం అందుకున్న ఎస్ఆర్ నగర్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని గాయపడిన తరుణ్‌ని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ తరుణ్ మృతి చెందాడు. పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న ఎస్ఆర్ నగర్ పోలీసులు రౌడీషీటర్ షరీఫ్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.

Next Story