- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
suicide : ఉరివేసుకుని వ్యక్తి ఆత్మహత్య
by Sridhar Babu |
ఇంటి దూలానికి ఉరి వేసుకుని ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

X
దిశ, చిలుకూరు : ఇంటి దూలానికి ఉరి వేసుకుని ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్సై సురబి రాంబాబు తెలిపిన వివరాల ప్రకారం.. గరిడేపల్లి మండలం వెల్దండకు చెందిన జీలకర్ర రమేష్ (45) 15 సంవత్సరాల క్రితం చిలుకూరు మండలంలోని బేతవోలుకు వచ్చి జేసీబీ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. గురువారం ఉదయం 7 గంటలవుతున్నా అతను తను అద్దెకుంటున్న గది తలుపులు తీయకపోవడంతో ఇంటి యజమాని
ఎం.కోటమ్మకు అనుమానం వచ్చి కిటికిలోంచి చూశారు. రమేష్ దూలానికి ఉరి వేసుకోవడాన్ని గమనించిన ఆమె పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు తలుపులు బద్దలు కొట్టి మృతదేహాన్ని శవపరీక్ష కోసం కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడికి వెల్దండలో భార్య, ఇద్దరు పిల్లలున్నారు. కొడుకు వెంకటేష్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
- Tags
- suicide
Next Story






