- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
missing: ఆడుకోవడానికి వెళ్లిన చిన్నారి మిస్సింగ్
by Sridhar Babu |
ఆడుకోవడానికి వెళ్లిన చిన్నారి మిస్సయిన సంఘటన అబిడ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.

X
దిశ, కార్వాన్ : ఆడుకోవడానికి వెళ్లిన చిన్నారి మిస్సయిన సంఘటన అబిడ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...బేగంబజార్ చత్రి కి చెందిన ప్రియాంక గృహిణి. ఆమె కూతురు ప్రగతి తన సోదరి కొడుకు వృతిక్ తో కలిసి శనివారం సాయంత్రం కట్టెలమండిలోని ముత్యాలమ్మ దేవాలయంలో ఆడుకోవడానికి వెళ్లింది.
కూతురు ఎంతకీ ఇంటికి రాకపోవడంతో తల్లి ఆ దేవాలయానికి వెళ్లి చూడగా ఇక్కడ కనిపించలేదు. చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికినా ప్రయోజనం లేకపోవడంతో అబిడ్స్ పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
- Tags
- missing
Next Story






