- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బాలింత మృతికి కారణమైన డాక్టర్ పై కేసు నమోదు
by Sridhar Babu |
నిర్లక్ష్యంగా వ్యవహరించి బాలింత మృతికి కారణమైన వైద్యురాలిపై కేసు నమోదు చేసినట్లు నిర్మల్ పట్టణ ఇన్స్పెక్టర్ ఎం.ప్రవీణ్ కుమార్ తెలిపారు.

X
దిశ, ప్రతినిధి నిర్మల్ : నిర్లక్ష్యంగా వ్యవహరించి బాలింత మృతికి కారణమైన వైద్యురాలిపై కేసు నమోదు చేసినట్లు నిర్మల్ పట్టణ ఇన్స్పెక్టర్ ఎం.ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం నిర్మల్ పట్టణానికి చెందిన అఫ్రోజ్ అహ్మద్ ఖాన్ తన భార్యకు పురిటి నొప్పులు రావడంతో స్థానికంగా ఉండే ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అక్కడ డాక్టర్ ఆమె పరిస్థితి గమనించి సిజేరియన్ ఆపరేషన్ చేయాలని తెలిపారు. ఆపరేషన్ చేసిన తర్వాత ఆమెకు తీవ్ర రక్తస్రావమై మరణించిందని పేర్కొన్నారు. తన భార్య మరణానికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని ఆమె భర్త, బంధువులు ఆస్పత్రి వద్ద ధర్నా చేశారు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు మృతురాలి భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
- Tags
- case registered
Next Story






