- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
స్నానం చేయడానికి బాత్‌రూమ్‌లోకి వెళ్ళిన యువతి.. డోర్ తీసి చూసిన తమ్ముడు షాక్
20 ఏళ్ల యువతి తన సొంత ఇంట్లోని బాత్‌రూమ్‌లో అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించింది.

దిశ వెబ్ డెస్క్: 20 ఏళ్ల యువతి తన సొంత ఇంట్లోని బాత్‌రూమ్‌లో అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించింది. ఈ ఘటన బెంగళూరులో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. బెంగళూరుకు చెందిన ఒక యువతి స్నానం చెయ్యడానికి అని బాత్రూంకి వెళ్ళింది. అయితే ఎంతసేపటికి ఆ యువతి తిరిగి బయటకు రాకలేదు. ఈ నేపథ్యంలో అనుమానం వచ్చిన ఆమె తమ్ముడు బాత్రూం డోర్‌ని కొట్టారు.
అయితే లోపల నుండి ఎలాంటి స్పందన రాలేదు. దీనితో యువతి తమ్ముడు బాత్రూం డోర్‌ను పగలగొట్టి చూడగా యువతి రక్తపుమడుగులో పడి ఉంది. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో డీసీపీ మాట్లాడుతూ.. ఆమె మెడ పైన అలానే మోచేతి పైన కత్తితో కోసిన గాయాలు ఉన్నాయని తెలిపారు.
అధిక రక్తశ్రావం కావడంతో యువతి మరణించినట్టు తెలిపారు. అయితే ఆమెది ఆత్మహత్యనా లేక హత్యనా అని తెలుసుకునేందుకు అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నట్లు తెలిపారు. కాగా యువత తల్లి సామాజిక కార్యకర్త. ఆమె మాట్లాడుతూ.. తాను తన కూతుర్ని చాలా ప్రేమగా చూసుకునే దాన్ని అని, అలానే తన కూతురు కూడా చాలా ధైర్యంగా ఉండేదని, ప్రతి చిన్న విషయం తనతో పంచుకునేదని తెలిపారు.
కానీ ఇప్పుడు ఏమైందో తననికి అర్థం కావట్లేదని, తన కూతురు ఎందుకు ఇలా చేసిందో కూడా తనకు తెలియడం లేదని పేర్కొన్నారు. ఒక సామాజిక కార్యకర్తగా ఎంతో మందిని రక్షించానని తెలిపారు. అలానే ఎంతో మందిని ప్రశ్నించానని వాళ్లు ఏదైనా కక్ష పెట్టుకుని తన కూతురు చావుకు కారణమై ఉండొచ్చు అని అనుమానం వ్యక్తం చేశారు. అనుమానాస్పద స్థితిలో మరణించిన తన కూతురు కేసు విషయంలో సమగ్ర విచారణ జరపాలని, తనకు న్యాయం చేయాలని ఆమె డిమాండ్ చేశారు.
తల్లి తమ్ముడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. శవపరీక్షల నిమిత్తం యువతి డెడ్‌బాడీను ఆసుపత్రికి తరలించారు. హత్యనా, ఆత్మహత్యనా అనే విషయం పోస్టుమార్టం రిపోర్ట్ వస్తే కానీ చెప్పలేమని పోలీసులు తెలిపారు.






