- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పేకాట శిబిరంపై పోలీసుల దాడి.. అదుపులో 5గురు పేకాట రాయుళ్లు
by Jakkula.Mamatha |
కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం మల్లిశాల గ్రామ శివారున రహస్యంగా నిర్వహిస్తున్న పేకాట శిబిరంపై జగ్గంపేట పోలీసులు దాడులు నిర్వహించారు.

X
దిశ, జగ్గంపేట:కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం మల్లిశాల గ్రామ శివారున రహస్యంగా నిర్వహిస్తున్న పేకాట శిబిరంపై జగ్గంపేట పోలీసులు దాడులు నిర్వహించారు. జగ్గంపేట ఎస్సై రఘునాథ రావుకు వచ్చిన సమాచారం మేరకు ఎస్సై తన సిబ్బందితో శుక్రవారం తెల్లవారుజామున మల్లిశాల గ్రామంలో నిర్వహిస్తున్న పేకాట శిబిరంపై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఐదుగురు పేకాట రాయుళ్లను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి 10,200 నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై రఘునాథరావు తెలిపారు. వీరిపై కేసు నమోదు చేసి కోర్టుకు హాజరు పరచనున్నట్లు తెలిపారు.
Next Story






