- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘ఇంట్లో దెయ్యాలున్నాయ్.. అందరూ చచ్చిపోతారు..’ రూ.30 లక్షలు కాజేసిన బ్యాచ్.. చివరికి...

దిశ, వెబ్‌డెస్క్: నిజంగా దెయ్యాలు ఉన్నాయో లేదో తెలియదు కానీ.. దెయ్యాల (Ghosts) పేరు చెప్పి దోపిడీలకు పాల్పడే దొంగలు మాత్రం మన చుట్టూ చాలామందే ఉన్నారు. మూఢనమ్మకాల (Myths) ముసుగులో జనాల వీక్‌నెస్‌ని ఆసరాగా చేసుకుని లక్షలు కాజేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే సికింద్రాబాద్ (Secunderabad)లోని గాంధీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. దెయ్యాలున్నాయని, వాటిని తరిమికొట్టకపోతే అందరూ చనిపోతారని ఓ కుటుంబాన్ని భయపెట్టి ఏకంగా రూ.30 లక్షలు కాజేశారు ఓ నలుగురు దుండగులు. అనంతరం బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి రూ.20 లక్షలు రికవరీ చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. న్యూబోయిగూడకు చెందిన జయ గత కొద్ది కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతోంది. అప్పుడే సోషల్ మీడియాలో పూజలతో సమస్యలు తీరుతాయనే అడ్వర్టైజ్‌మెంట్ చూసిన ఆమె కుమార్తె జయనందిని.. ఆ నంబర్‌కు కాల్ చేసి పరిష్కారం కోరింది. ఆమె నిస్సహాయతను గమనించి నిందితులు పురాణం నివాస్, ఎర్నాల వాసు, కిన్నెరసాయి, నాగరాజులు ఇంట్లో ఆత్మ తిరుగుతోందని, దాన్ని తరిమికొట్టేందుకు పూజలు చేయాలని, లేకుంటే అందరూ చనిపోతారంటూ ఆమెని భయపెట్టారు.
ఆ భయంలోనే వాళ్లు అడిగినంత సొమ్ము ఇవ్వడానికి సిద్ధపడింది జయనందిని కుటుంబం. అలా ఆగస్టు 17 నుంచి రూ.30 లక్షల దోచుకున్న నిందితులు.. మరింత డబ్బు కావాలని ఒత్తిడి చేయసాగారు. అయితే జయ ఆరోగ్యం ఏ మాత్రం మెరుగవ్వపోవడంతో మోసపోయామని గ్రహించిన జయనందిని ఫ్యామిలీ పోలీసులను ఆశ్రయించింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను అదుపులోకి తీసుకుని వారి నుంచి రూ.20 లక్షల రూపాయలను రికవరీ చేశారు.






