ఎవిక్షన్ పాస్‌ను చీపురుపుల్లతో సమానంగా చూసిన యావర్.. నాగ్ ఖంగుతిన్నాడుగా..

by sudharani |
ఎవిక్షన్ పాస్‌ను చీపురుపుల్లతో సమానంగా చూసిన యావర్.. నాగ్ ఖంగుతిన్నాడుగా..
X

దిశ, సినిమా : ‘బిగ్ బాస్’ సీజన్ 7 రోజురోజుకు మరింత ఇంట్రెస్టింగ్‌గా సాగుతుంది. హౌజ్ మేట్స్ అందరితో పోటీపడి తొలి ఎవిక్షన్ పాస్ సంపాదించుకున్న యావర్.. దాన్ని పొందడంలో లోపం ఉందని, గెలిచిన తీరు కరెక్ట్‌గా లేదని హోస్ట్ నాగార్జున చెప్పడంతో హర్ట్ అయ్యాడు. ఒకవేళ తాను డిజర్వ్ కాకపోతే తిరిగిచ్చేస్తానని.. దాన్ని చీపురుపుల్ల మాదిరిగా ట్రీట్ చేశాడు. డిసైడ్ చేసుకో అని చెప్తే.. అవసరం లేదని టేబుల్ మీద పెట్టేశాడు. దీంతో ఖంగుతిన్న నాగ్.. ఎవిక్షన్ పాస్ యావర్‌కు ఇవ్వాలా లేదా అనేది ఇంటి సభ్యుల ఓటింగ్‌తో నిర్ణయిస్తామని కవర్ చేసే ప్రయత్నం చేశాడు.

అయితే యావర్ ఎవిక్షన్ పాస్‌ను తిరిగి ఇచ్చేయాలని నిర్ణయించుకోవడంతో నెటిజన్ల నుంచి మంచి కాంప్లిమెంట్స్ అందుతున్నాయి. సెల్ఫ్ రెస్పెక్ట్ పర్సన్.. యావర్ గోల్డ్.. ఈ టైమ్‌లో ఈ డెసిషన్ తీసుకోవడం టైటిల్ విన్నర్‌గా మార్చేస్తుంది.. అని కామెంట్స్ చేస్తున్నారు. ఒకవేళ అమర్, శోభ, ప్రియాంక ఇలాంటి తప్పులు చేస్తే ఎత్తి చూపడని.. దాన్ని స్ట్రాటజీ, సంచాలక్ డెసిషనే ఫైనల్ అని ఇచ్చేస్తారని నాగార్జునను విమర్శిస్తున్నారు.

Advertisement

Next Story