Bigg Boss 8: అతను నా నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నాడంటూ తన ప్రేమ గురించి చెప్పిన సోనియా

by Prasanna |
Bigg Boss 8: అతను నా నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నాడంటూ తన ప్రేమ గురించి చెప్పిన సోనియా
X

దిశ, వెబ్ డెస్క్ : బిగ్ బాస్ సీజన్ 8 రసవత్తరంగ కొనసాగుతుంది. సోమవారం అయితే చాలు నామినేషన్స్ ప్రాసెస్ మొదలవుతుంది. ఒకరిని ఒకరు తిట్టుకుంటూ .. కొట్టుకునే వరకు వెళ్తుంది. ఈ మధ్యలో కంటెస్టెంట్స్ తో వారి ఫ్యామిలీ, లవ్ ఫెయిల్యూర్ , లవ్ గురించి చెప్పుకుంటారు. తాజాగా సోనియా తన లవ్ స్టోరీ గురించి చెప్పింది.

నటి సోనియా బిగ్ బాస్ ఇంట్లో ప్రేరణతో తన ప్రేమ గురించి చెబుతూ ఎమోషనల్ అయింది. అతను నాకు పరిచయం అయి మూడేళ్ళు అవుతుంది. నేను మొదలుపెట్టిన వర్క్ లో నాకు వెబ్ డిజైనింగ్ లో హెల్ప్ చేసాడు. అతను ఒక స్పాన్సర్ గా కూడా సపోర్ట్ చేస్తున్నాడు. అతను నా లైఫ్ లోకి వచ్చాక ఎన్నో మార్పులు వచ్చాయి. నేను ఇంకా అతనికి ప్రపోజ్ చేయలేదు. అతను నా నిర్ణయం చాలా ఎదురుచూస్తున్నాడని చెప్పింది.

అయ్యో అవునా సోనియా వేరే అబ్బాయిని ప్రేమిస్తుందా.. నిఖిల్ పరిస్థితి ఏంటని కొందరు అంటుండగా .. మరి కొందరు అయితే మరి బిగ్ బాస్ అయ్యాక మీ పెళ్లి ఓకే అవుతుందిలే అని కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకీ ఆ లక్కీ హీరో ఎవరో అని సోనియా ఫ్యాన్స్ , బిగ్ బాస్ అభిమానులు చర్చించుకుంటున్నారు.

Advertisement

Next Story