- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బయటకు వచ్చిన శోభా శెట్టికి ఘోరమైన అవమానం.. ఇప్పటి వరకు ఏ కంటెస్టెంట్‌కి జరగలేదేమో..!
బిగ్ బాస్ సీజన్ 7 చివరి దశకు చేరుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: బిగ్ బాస్ సీజన్ 7 చివరి దశకు చేరుకుంది. ప్రతి సారి టాప్ 5 కంటెస్టెంట్స్ ఉంటే.. ఈసారి మాత్రం టాప్ 6 (ప్రశాంత్, శివాజీ, యావర్, అమర్, ప్రియాంక, అర్జున్) ఉన్నారు. వీరిలో ఫైనల్‌లో విన్నర్‌గా నిలిచి ట్రోఫీ గెలుచుకునేది ఎవరో తెలియాల్సి ఉంది. ఆదివారం ఎపిసోడ్‌లో శోభాశెట్టి ఎలిమినేట్ అయ్యి ఇంటి నుంచి బయటకు వచ్చిన విషయం తెలిసిందే. ఇక శోభా శెట్టి బయటకు వచ్చాక తన అభిమానులు గ్రాండ్‌గా వెల్కమ్ చెప్పారు. ఈ క్రమంలోనే కొంత మంది చాలా అవమానకరంగా మాట్లాడారు.
14 వారాలు పాటు నాకు ఓట్లు వేసి మీరు నాకు సపోర్ట్‌గా నిలిచారు. మరి ఇప్పుడు ఎలిమినేషన్ అయ్యానంటే ఏం నచ్చలేదో మీకు అని శోభా మాట్లాడుతుండగా.. వెనక నుంచి అసలు నువ్వు ఎప్పుడో రావాల్సి ఉంది ఇప్పటివరకు ఉన్నావు అంటూ అరవడం మొదలు పెట్టారు. మరొకరేమో.. అసలు నువ్వు ఎందుకు హౌస్‌లో ఉన్నప్పుడు అంత ఓవర్ యాక్షన్ చేశావంటూ మాట్లాడారు. దీంతో శోభాశెట్టి ముఖం మాడిపోయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పాపం శోభాకి ఇంత అవమానం జరిగిందేంటి అంటూ నెట్టంట కామెంట్లు పెడుతున్నారు.






