Bigg Boss-9: అగ్ని పరీక్ష పేరుతో సెలెక్షన్‌లో సామాన్యులకు చుక్కలు చూపిస్తున్న జడ్జెస్.. దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు

by Mallepaka Hamsa |

తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్ సక్సెస్‌ ఫుల్‌గా కొనసాగుతూ పలు సీజన్లను పూర్తి చేసుకుంటుంది.

Bigg Boss-9: అగ్ని పరీక్ష పేరుతో సెలెక్షన్‌లో సామాన్యులకు చుక్కలు చూపిస్తున్న జడ్జెస్.. దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు
X

దిశ, సినిమా: తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్ సక్సెస్‌ ఫుల్‌గా కొనసాగుతూ పలు సీజన్లను పూర్తి చేసుకుంటుంది. ఇప్పటికే 8 సీజన్లు పూర్తి చేసుకోగా.. 9వ సీజన్ ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా అని అంతా ఎదురుచూస్తున్నారు. ఈక్రమంలోనే.. బిగ్‌బాస్ హోస్ట్ అక్కినేని నాగార్జున సీజన్ 9 ఈ సారి ఊహించని విధంగా ఉండబోతున్నట్లు ప్రోమో ద్వారా వెల్లడించారు. అంతేకాకుండా ఈ సారి సెలబ్రిటీలతో పాటు సామాన్యులకు కూడా ఇంట్లోకి వెల్లే అవకాశం ఉన్నట్లు తెలిపాడు. సెప్టెంబర్ 5న ప్రారంభం కాబోతున్న ఈ షోకు.. వెళ్లేందుకు అప్లికేషన్ చేసుకోవాలనడంతో ఎంతోమంది సామాన్య ప్రజలు అప్లై చేసుకున్నారు. ఇప్పటికే కామన్ పీపుల్స్‌ను 45 మందిని సెలెక్ట్ చేసి వారిని ‘అగ్నిపరీక్ష’ పేరుతో ఓ షో కండక్ట్ చేశారు.

ఇందులో ఐదుగురు సెలెక్ట్ చేసి హోల్డ్‌లో పెట్టగా.. ఇంకా 16 మందిలో మరో 9 మందిని ఎంపిక చేసే ప్రక్రియ కొనసాగుతోంది. ఈ ప్రోగ్రామ్ ద్వారా ముగ్గురు సామాన్యులకు బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇస్తారంట. దాని కోసం వచ్చిన వాళ్లకు నానా రకాల పిచ్చి టాస్కులు ఇస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఈ షోలో శ్రీముఖి(Srimukhi), యాంకర్‌గా వ్యవహరిస్తుండగా.. బింధు మాధవి(Bindhu Madhavi), నవదీప్(Navdeep), అభిజిత్ జడ్జెస్‌గా చేస్తున్నారు. ఈ షో అంతా హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ రోజు ఎపిసోడ్ డూ ఆర్ డై టాస్క్ పెట్టి సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నారు. ఓ ఇద్దరు యువకులను పిలిచి 10 నిమిషాల్లో కేజీ బరువు పెరగాలని తినుబండారాలు ముందు పెట్టారు.

దీంతో వారు బరువు పెరిగేందుకు తెగ కష్టపడిపోయారు. అలాగే ఇద్దరు అమ్మాయిలకు నుదుటిపై పచ్చబొట్టు పొడిపించుకోమంటారు. అది కూడా నేను ఓడిపోయిన వ్యక్తిని అని వేయించుకోవాలని అంటారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక వాటిని చూసిన నెటిజన్లు సెలబ్రిటీలకు ఏమో డైరెక్ట్ గా ఎంట్రీలు ఇచ్చి.. సామాన్యులకు మాత్రం ఇలాంటి పిచ్చి టాస్కులు పెట్టి ఇబ్బంది పెడుతారా అంటూ తిట్టిపోస్తున్నారు. సామాన్యులకు ఎంట్రీ ఇవ్వాలంటే ఇన్ని బాధలు పడాలా అని బిగ్‌బాస్ టీమ్‌ను ఏకిపారేస్తున్నారు. అంతేకాకుండా జడ్జెస్‌ కూడా కావాలనే పిచ్చి టాస్కులు ఇస్తున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు. మొత్తానికి అగ్నిపరీక్ష ప్రోగ్రామ్ కాస్త వివాదంగా మారుతోంది. చేసే వాళ్లకే కాదు.. చూసే వాళ్ళకు కూడా చిరాకు పుట్టేలా చేస్తుంది.

Next Story