ఆ సమయంలో నాకు ఒక్క ఫోన్ కూడా రాలేదు.. బిగ్ బాస్ బ్యూటీ ఎమోషనల్

by sudharani |
ఆ సమయంలో నాకు ఒక్క ఫోన్ కూడా రాలేదు.. బిగ్ బాస్ బ్యూటీ ఎమోషనల్
X

దిశ, వెబ్‌డెస్క్: బిగ్ బాస్ సీజన్ 7 కి వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ నయని పావని. వచ్చిన వన్ వీక్‌కే పాపం ఇంటి నుంచి ఎలిమినేట్ అయ్యి అందరినీ షాక్‌కు గురిచేసింది. ఎలిమినేషన్‌తో ఫుల్ ఎమోషనల్ అయిన నయనీ.. ఏడుస్తూనే ఇంటి నుంచి బయటకు వచ్చింది. అయితే.. హౌస్‌లో ఉన్నది ఒక్క వారమే అయినప్పటికి నయనీకి ఫాలో యింగ్ బాగానే పెరిగిందని చెప్పుకోవచ్చు. దీంతో ఆమె గతంలో ఇచ్చిన ఇంటర్వ్యూలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

‘‘మా నాన్న చనిపోయిన తర్వాత ఇంటి బాధ్యతలన్నీ నేనే చూసుకునేదాన్ని. కొందరు చాలా దారుణంగా మాట్లాడేవారు. మీ నాన్న చనిపోయాక ఇలాంటి డ్రెస్సులు వేస్తారా అని కామెంట్స్ చేసేవారు. కొందరి కామెంట్స్ చూసి నేను చాలా బాధపడేదాన్ని. ఒక్కోసారి డిప్రషన్‌కు గురయ్యేదాన్ని. అసలు దానికి దీనికి కారణం ఏంటీ.. మీకు ఇష్టం లేకపోతే నా ఫొటోలు, వీడియోలు చూడకండి. మా ఫ్యామిలీ బాధలో ఉండే సమయంలో ఇలాంటి కామెంట్స్ నన్ను మరింత బాధ పెట్టేవి. డబ్బులు సంపాదించమని మా నాన్న ఎప్పుడు చెప్పలేదు. మన వల్ల ఒకరు ఇబ్బంది పడకూడదు అనే చెప్పేవారు. నేను ఇంట్లో చాలా గారాబంగా పెరిగాను. మా నాన్నకు సర్జరీ సమయంలో ఫ్రెండ్స్, బంధువులు ఎవరు ఫోన్ చేయలేదు. నాకు ఎవరూ కాల్ చేయలేదేంటి.? అని ఆ సమయంలో చాలా ఏడ్చాను’’ అంటూ నయని గతంలో ఎమోషనల్ అయిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.

Advertisement

Next Story

Most Viewed