- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బిగ్‌బాస్-9: రెండో వారం ఎలిమినేట్ అయి హౌస్ నుంచి బయటకు వచ్చేది ఎవరంటే?
తెలుగు రియాలిటీ షో రెండు వారం కూడా పూర్తి కావొస్తోంది.

దిశ, సినిమా: తెలుగు రియాలిటీ షో రెండు వారం కూడా పూర్తి కావొస్తోంది. మొదటి వారం ఊహించని విధంగా కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ ఎలిమినేట్ అయి ఇంటి నుంచి బయటకు వచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఇంట్లో 14 మంది కంటెస్టెంట్స్ ఉండగా.. అందులో ఓ కామన్ మెన్ ఇంటి నుంచి బయటకు రాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సారి నామినేషన్లలో మొత్తం ఏడుగురు ఉన్నారు. భరణి, ఫ్లోరా సైనీ, హరీష్, మనీష్, ప్రియ, పవన్, సుమన్ శెట్టి (Suman Shetty)ఉండగా.. ఇందులో తక్కువ ఓట్లు పడిన వారు బయటకు రాబోతున్నారు. ఒక ఓటింగ్ విషయానికొస్తే.. ఫస్ట్ వీక్ సైలెంట్‌గా ఉండి.. ఈ వారం హౌస్‌లో తన విశ్వరూపం చూపించిన నటుడు సుమన్ శెట్టి టాప్‌లో కొనసాగుతుండటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
ఇక రెండు స్థానాల్లో భరణి(Bharani), పవన్(Pawan), ఫ్లోరా ఉండగా.. డేంజర్ జోన్‌లో హరీష్(Harish), ప్రియ, మనీష్(Manish) ఉన్నట్లు తెలుస్తోంది. నామినేషన్స్‌లో ఉన్న ఏడుగురిలో అతి తక్కువ ఓట్లు మర్యాద మనీష్‌కు వచ్చినట్లు టాక్. మనీష్‌పై ఆదివారం వేటు పడబోతున్నట్లు పలు వార్తలు వైరల్ అవుతూ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. గత వారం సెలబ్రిటీ అయింది కాబట్టి ఈ వారం కచ్చితంగా సామాన్యుల్లో ఒక్కరు హౌస్ నుంచి బయటకు రావడం ఖాయమని అంతా చర్చించుకుంటున్నారు. హౌస్‌లోకి చివరగా వచ్చిన మనీష్ అతి తొందరలోనే బయటకు రాబోతున్నాడు.






