- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బిగ్‌బాస్-9: హౌస్‌లోకి వెళ్లే సెలబ్రిటీల లిస్ట్ వైరల్.. వారు వెళితే మాత్రం ఈ సారి రచ్చ రచ్చే!
తెలుగు ఆడియన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రియాలిటీ షో ‘బిగ్‌బాస్-9’(Bigg Boss-9) మరో మూడు రోజుల్లో సెప్టెంబర్ 7న ఘనంగా ప్రారంభం కాబోతుంది.

దిశ, సినిమా: తెలుగు ఆడియన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రియాలిటీ షో ‘బిగ్‌బాస్-9’(Bigg Boss-9) మరో మూడు రోజుల్లో సెప్టెంబర్ 7న ఘనంగా ప్రారంభం కాబోతుంది. ఇది వరకే 8 సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో ఈ సారి డబుల్ హౌస్, డబుల్ డోస్ థీమ్‌తో రాబోతుంది. ఈసారి బిగ్‌బాస్ టీమ్ పకడ్భందీగా ప్లాన్ చేశారు. ఓ వైపు సామాన్యులతో పాటు సెలబ్రిటీలు గేమ్ ఆడబోతున్నట్లు ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా అగ్నిపరీక్ష పేరుతో సామాన్యులను సెలెక్ట్ చేసే పనిలో పడ్డారు. కామన్ పీపుల్ కేవలం 5 మందిని హౌస్‌లోకి పంపించాలని ప్లాన్ చేసినట్లు టాక్. ఇక సెలబ్రిటీల్లో టీవీ ఆర్టిస్టులు, కొరియోగ్రాఫర్ల నుంచి సోషల్ మీడియాలో సంచలనం సృష్టించిన సెలబ్రిటీల వరకూ పలువురిని సెలెక్ట్ చేసినట్లు పలు వార్తలు వైరల్ అవుతున్నాయి.
ఇందులో కొన్ని పేర్లు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. బిగ్‌బాస్‌లో పాల్గొన బోతున్న వారి పేర్లు, వారి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం. ప్రభాస్ సినిమాలో నటించి తమిళ హీరోయిన్ నిక్కీ గల్రాని(Nikki Galrani), ఆది పినిశెట్టి భార్య బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లబోతున్నట్లు తెలుస్తోంది. ఆమెతో పాటు ‘నరసింహా నాయుడు’ సినిమాలో ఐటమ్ సాంగ్ చేసిన ఆశా షైనీ(Asha Shiny) కూడా వెళ్లబోతుందట. ఇక సీరియల్ యాక్టర్స్ విషయానికొస్తే.. ‘నా పేరు మీనాక్షి’ తో ఓవర్ నైట్ స్టార్‌గా మారిన యంగ్ బ్యూటీ నవ్య స్వామి, గుప్పెడంత మనసు సీరియల్ హీరో ముఖేష్ గౌడ, డీ కంటెస్టెంట్, జానీ మాస్టర్‌పై సంచలన ఆరోపణలు చేసి ఫుల్ పాపులారిటీ దక్కించుకున్న శ్రేష్టి వర్మ కూడా వెళ్లబోతుంది. అలాగే కోయిలమ్మ సీరియల్ హీరోయిన్ తేజస్విని గౌడ, కావ్య, కల్కి, జబర్దస్త్ ఇమానుయేల్, ‘రాను బొంబాయిని రాను’ సాంగ్‌తో పాపులర్ అయిన సింగ్ రాము రాథోడ్ బిగ్‌బాస్ అవకాశం దక్కించుకున్నట్లు టాక్.
ఇక ఇటీవల అలేఖ్య చిట్టి పికిల్స్ బిజినెస్‌తో సోషల్ మీడియాను షేక్ చేసిన అమ్మాయి కూడా బిగ్‌బాస్ షోలో చాన్స్ దక్కించుకుంది. వీరితో పాటు దివ్వెల మాధురి జంట కూడా బిగ్‌బాస్‌లోకి వెళ్లబోతున్నట్లు పలు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇక సామాన్యుల్లో ప్రియా శెట్టి, పవన్ కళ్యాణ్, నాగ ప్రశాంత్, మాస్క్ మ్యాన్ హరీష్, మనీష్ పేర్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వార్తలు వైరల్ అవుతున్నాయి. దీంతో ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు ఆ సారి టాస్కుల్లో వీరంతా రచ్చ చేస్తారని అంటున్నారు.






