- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Bigg Boss-9: ఈ వారం నామినేషన్స్‌లో 9 మంది కంటెస్టెంట్స్.. ఎలిమినేట్ అయి బయటకు వచ్చేది ఆ ఇద్దరేనా!
బిగ్‌బాస్ సీజన్-9 సెప్టెంబర్ 7న ఘనంగా ప్రారంభమైన విషయం తెలిసిందే.

దిశ, సినిమా: బిగ్‌బాస్ సీజన్-9 సెప్టెంబర్ 7న ఘనంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే ఈ సారి 15 మంది కంటెస్టెంట్స్ హౌస్‌లోకి వెళ్లారు. అన్ని సీజన్లకు భిన్నంగా ఈ సారి 9 మంది సెలబ్రిటీలు.. 6 మంది సామాన్యులు ఈ షోలో పోటీపడబోతున్నారు. ఈ సారి చదరంగంలా కాకుండా గేమ్ రణరంగంలా ఉండనుందని నాగార్జున ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఎప్పటి లాగే మొదటి రోజే హౌస్ లోని చాలా మంది కంటెస్టెంట్స్ మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి . ఇక అసలు సిసలు నామినేషన్ల పర్వం వచ్చే సరికి ఒకరిపై ఒకరు కత్తులు దూసుకున్నారు కంటెస్టెంట్స్. ఇక ఈ షోలో మొదటి వారం నామినేషన్స్‌లో రీతూ చౌదరి, సుమన్ శెట్టి, ఫ్లోరా సైనీ, సంజన గల్రానీ, శ్రష్ఠి వర్మ, రాము రాథోడ్, తనూజ, ఇమ్మాన్యుయేల్, డీమన్ పవన్ ఉన్నారు. ఇందులో రీతూ చౌదరి, పవన్, ఫ్లోరా డేంజర్ జోన్‌లో ఉన్నట్లు టాక్. ఈ ముగ్గురిలో.. ఓ ఇద్దరు హౌస్ నుండి బయటకు రాబోతున్నారు. ఈ వారం డబుల్ ఎలిమినేషన్స్ ఉండగా.. ఎవరు ఎలిమినేట్ అవుతారా? అని ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగిపోయింది.






