- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అయోధ్య గర్భగుడిలో రామయ్య తొలి ఫొటో చూశారా..?
అయోధ్యలో రామ మందిర ప్రాణ ప్రతిష్టకు ముహూర్తం సమీపిస్తుండటంతో ఏర్పాట్లు ఊపందుకున్నాయి.

దిశ, వెబ్‌డెస్క్: అయోధ్యలో రామ మందిర ప్రాణ ప్రతిష్టకు ముహూర్తం సమీపిస్తుండటంతో ఏర్పాట్లు ఊపందుకున్నాయి. అయితే తాజాగా గర్భగుడిలో కొలువుదీరిన రామ్ లల్లా విగ్రహ తొలి ఫొటో బయటకు వచ్చింది. 51 ఇంచుల్లో తయారైన ఈ విగ్రహాన్ని మైసూరుకు చెందిన వ్యక్తి తయారు చేశారు. ఓ వస్త్రంతో రాముడి విగ్రహాన్ని కప్పి ఉంచగా ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విశ్వ హిందూ పరిషత్ మీడియా ఇన్ ఛార్జ్ శరద్ శర్మ వీటిని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆలయ పవిత్ర ప్రాంగణంలో వేద పండితులు ఇప్పటికే పూజా కార్యక్రమాలను నిర్వమిస్తున్నారు. రామజన్మ భూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సభ్యులు ఈ ప్రత్యేక పూజల్లో పాల్గొన్నట్లు వీహెచ్‌పీ తెలిపింది. గురువారం మధ్యాహ్నం గర్భగుడిలో రామ్ లల్లా విగ్రహాన్ని ఉంచినట్లు పూజారి అరుణ్ దీక్షిత్ తెలిపారు. వేద పండితులు మంత్రోచ్ఛారణల నడుమ ఈ క్రతువు జరిగినట్లు రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ తెలిపింది.






